Thursday, January 19, 2012
Wednesday, January 18, 2012
కేవలం Rs.999/-కే 3G మోడెం 3GB ఉచిత డేటాతో పొందడం ఇలా!
ఆశ్చర్యంగా ఉందా?
3GB -Rs.625/-
10GB - Rs.1250/-
నార్మల్ గా : 15ps/20kb
అంటే మొదటినెల తక్కువకేఇచ్చినట్లిచ్చి రెండోనెలనుండీ వారి డేటా రేట్లతో మనపై రుద్దుతారన్నమాట..!
ముందుగా ఆ డేటా కార్డ్ ప్రత్యేకతలు తెలుసు కుందాం.
- 2G/3G కంపేటిబుల్
- మెమొరీ కార్డ్ పెట్టుకోవచ్చు.
- మెస్సేజ్ లు కంప్యూటర్ నుండే పంపొచ్చు.
- కాల్స్ కంప్యూటర్ నుండే చేయోచ్చు.
- డేటా యూజేజ్ చెక్ చేసుకోవచ్చు.
ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే ఈ డేటా కార్డ్కి ఉన్న లాక్ మార్కెట్ లో, మనం డేటా కార్డ్ తీసుకున్న దగ్గరే Rs.100/- కు తీసి ఇస్తున్నారు. ఆతర్వాత మనం ఏ SIM (2G లేదా 3G ) అయినా వేసుకొని ఎంచక్కా వాడుకోవచ్చు. ఇదే డేటా కార్డు మనం విడిగా కొనాలంటే దాదాపు Rs.1500 - Rs.2000 ఉంది.
కాకపొతే ఈ లాక్ తీస్తే దాటా కార్డ్ వారంటీ పోతుంది. ఉచిత డేటా ని రద్దుచేసే అవకాశం ఉంది.
కనుక నెలరోజులు ఉపయోగించాక ఈ లాక్ మీ అంతట మీరే చాలా ఈజీ గా తీసేయవచ్చు .
వారంటీ పోయినా పర్వాలేదనుకున్న వాళ్ళు ఇక చదవండి:
ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి .**** అని ఉన్న చోట మీ కార్డ్ యొక్క 15 అంకెల IMEI నంబర్ని మార్చి ఎంటర్ చేయండి.
http://www.bb5.at/huawei.php?imei=*****
ఎప్పుడు క్రింది విదంగా మీ లాక్ కోడులు వస్తాయి ...
IMEI: 355013047996155
Entsperren / Unlock: 44728452
Flashen / Flash: 53954783
(c) SERGEY/MKL 2010
unlock: అని ఉన్నదే మీ లాక్ కోడ్ .
ఇప్పుడు మీ డేటా కార్డ్ లో వేరే SIM ( aircel కానిది ) పెట్టి పోర్ట్ లో డేటా కార్డ్ పెడితే ఆటోమేటిక్ గా లాక్ కోడ్ అడుగుతుంది. అప్పుడు పైన వచ్చిన లాక్ కోడ్ ను ఎంటర్ చేస్తే లాక్ ఓపెన్ అయినట్లే ..
లాక్ కోడ్ కనుక 8 సార్లు కన్నా ఎక్కువగా తప్పుగా ఇస్తే మొత్తం లార్డ్ బ్లాక్ అవుతుంది.
చివరిగా ఓ విషయం: మార్కెట్ లో Rs.100- Rs200 మనదగ్గర లాక్ తీయడానికి గుంజుతున్నారని ఈ విషయం చెప్పా గానీ ఇలా చేయడం నిజానికి నేరం కావచ్చు. తర్వాత మీ ఇష్టం.
ఎంతయినా మన జాగర్తలో మనం ఉండాలిగా .
Wednesday, September 7, 2011
ఫేస్ బుక్ లో నకిలీ ‘రాఘవులు’
మొన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేరుతో ఫేస్ బుక్ లో నకిలీ అకౌంట్ తీయడం, అది మీడియాలో రావడం, తరువాత ముఖ్యమంత్రి కార్యాలయం దానిని ఖండించడం తెలిసిందే. అయితే తాజాగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు పేరుతో సోషల్ నెట్ వర్క్ వెబ్‌సైట్ ‘ఫేస్‌బుక్’లో రెండు ఖాతాలు వెలుగు చూశాయి.
రాఘవులుకు తెలియకుండానే ఆయన పేరిట రెండు అకౌంట్లను గుర్తుతెలియని వ్యక్తులు నిర్వహిస్తున్నారు. వికీపీడియా నుంచి తీసుకున్న సమాచారంతో ఫొటో లేని ఒక అకౌంట్, ఫొటోతో మరో అకౌంట్ నడుస్తున్నాయి. తొలి అకౌంట్‌లోని ప్రాథమిక సమాచారం కొంతమేరకు సరిగానే ఉన్నా ఆయన అలవాట్లు, అభిరుచులను తప్పుగా నమోదు చేసి చలామణిలో పెట్టారు. పుట్టిన తేదీ సహా చాలా తప్పులున్నాయి. తనకు ఇష్టమైన సంగీతం విప్లవమని, పుస్తకం పుచ్చలపల్లి సుందరయ్య జీవిత చరిత్రని, ఇష్టమైన చానల్ ఏబీఎన్ అంటూ ఇష్టానుసారం రాసిపెట్టారు.
ఈ చర్యలను సీపీఎం రాష్ట్ర పార్టీ ఖండించింది. రాఘవులుకు అసలు ఫేస్‌బుక్ అకౌంటే లేదని, దాన్ని ఎవరు నిర్వహిస్తున్నారో తెలియదని వివరించింది. ఫేస్‌బుక్‌లో ఉంచిన ప్రసంగ పాఠాలు ఆయనవి కావని పేర్కొంది. దీనిపై ఫేస్‌బుక్ నిర్వాహకులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపింది.
Thursday, June 16, 2011
తెలుగు వెబ్‌సైట్లకై శోధన
అత్యంత సులువుగా తెలుగు వెబ్‌సైట్లను గూగుల్‌లో వెతకటం ఎలా?
గూగుల్‌లో మీకు కావలసిన అంశంపై, ఏ ఏ "తెలుగు" వెబ్‌సైట్లు ఉన్నాయో వెతికే అవకాశం ఉంది.
దానికి సులువైన మార్గం ఈ లంకెకు వెళ్ళి ఇంగ్లీషులో టైప్ చేయటం. కానీ ఫలితాలు తెలుగులో ఉంటాయి.
మీరు టైప్ చేసే అక్షరాలకు మంచి ఫలితాలు కావాలంటే, ఈ లంకెలో ఉన్న బొమ్మను చూడండి. అది చూస్తే, ఏ కీ నొక్కితే ఏ తెలుగు అక్షరం వస్తుంది అన్న విషయం మీకే అర్థం అవుతుంది. తెలుగులో కనిపించే సైట్లు అన్నింటినీ తెలుగులో చూడాలి అన్నటైతే ఈ లంకెలో ఉన్న విధానాన్ని పాటించండి

