Wednesday, September 7, 2011

ఫేస్ బుక్ లో నకిలీ ‘రాఘవులు’

మొన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేరుతో ఫేస్ బుక్ లో నకిలీ అకౌంట్ తీయడం, అది మీడియాలో రావడం, తరువాత ముఖ్యమంత్రి కార్యాలయం దానిని ఖండించడం తెలిసిందే. అయితే తాజాగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు పేరుతో సోషల్ నెట్ వర్క్ వెబ్‌సైట్ ‘ఫేస్‌బుక్’లో రెండు ఖాతాలు వెలుగు చూశాయి.

రాఘవులుకు తెలియకుండానే ఆయన పేరిట రెండు అకౌంట్లను గుర్తుతెలియని వ్యక్తులు నిర్వహిస్తున్నారు. వికీపీడియా నుంచి తీసుకున్న సమాచారంతో ఫొటో లేని ఒక అకౌంట్, ఫొటోతో మరో అకౌంట్ నడుస్తున్నాయి. తొలి అకౌంట్‌లోని ప్రాథమిక సమాచారం కొంతమేరకు సరిగానే ఉన్నా ఆయన అలవాట్లు, అభిరుచులను తప్పుగా నమోదు చేసి చలామణిలో పెట్టారు. పుట్టిన తేదీ సహా చాలా తప్పులున్నాయి. తనకు ఇష్టమైన సంగీతం విప్లవమని, పుస్తకం పుచ్చలపల్లి సుందరయ్య జీవిత చరిత్రని, ఇష్టమైన చానల్ ఏబీఎన్ అంటూ ఇష్టానుసారం రాసిపెట్టారు.

ఈ చర్యలను సీపీఎం రాష్ట్ర పార్టీ ఖండించింది. రాఘవులుకు అసలు ఫేస్‌బుక్ అకౌంటే లేదని, దాన్ని ఎవరు నిర్వహిస్తున్నారో తెలియదని వివరించింది. ఫేస్‌బుక్‌లో ఉంచిన ప్రసంగ పాఠాలు ఆయనవి కావని పేర్కొంది. దీనిపై ఫేస్‌బుక్ నిర్వాహకులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపింది.

0 comments:

Post a Comment