Wednesday, March 30, 2011

వర్షం కోసం మేఘాలను (Artificial) తయారు చేసుకొంటున్న నాసా
దాని వీడియో ......

Tuesday, March 29, 2011

మీరు ఎంత కాలం జీవిస్తారో తెలుసుకోండి (When ur going to die ? )


http://deathclock.com/ Cry Smiley

అ౦త ధైర౦ ఉ౦టేనే చుడ౦డి!!!!! be Cool............ఓకే,

ఒకటేసారి అన్ని ఎ౦టీవైరస్ లతో స్కాన్ చేయడ౦


మీరు గనుక ఎవైనా ఫైళ్ళను అన్ని ఎ౦టీవైరస్ లతో స్కాన్ చేయల౦టే http://www.virustotal.com/ అనే వెబ్ సైట్ బాగా ఉపయోగపడుతు౦ది. దీని ద్వారా మరో ఉపయోగ౦ కూడా ఉ౦ది అదే౦ట౦టే మీ ఫైల్ కి వైరస్ ఉ౦దనుకు౦దా౦ , దానిలో వైరస్ ఉ౦దని ఏ ఎ౦టీవైరస్ సాఫ్ట్ వేర్లు గురిస్తే అవి నాణ్యమైనవిగా మన౦ గుర్తి౦చవచ్చు. ఉదా. పై బొమ్మలో చూడ౦డి Bitdefender , Kaspersky , Fsecure నేను అప్లోడ్ చేసిన ఫైల్ లో వైరస్ ఉ౦దని రిసల్ట్ ఇచ్చాయి. ఈ విధ౦గా మీరు కూడా ఎ౦టీవైరస్ ని పరిక్షి౦చవచ్చు.

Friday, March 11, 2011

జపాన్ లో ప్రకృతి విలయం .....

పెను భూకంపం.. సునామీ బీభత్సం వందలాది మంది మృతి

రిక్టర్ స్కేలుపై 8.9పాయంట్లు నమోదు

జపాన్ దేశం చరత్రలో 140 ఏళ్లలో అతి తీవ్రమైన విపత్తు * పదిమీటర్ల ఎత్తుకెగసిన పసిఫిక్ అలలు * 19 దేశాలకు సునామీ హెచ్చరికలు * ఉత్తర జపాన్‌ను ముంచేసిన సాగరం * గల్లంతైన రైలు.. కొట్టుకుపోయిన నౌక * చమురు రిఫైనరీల్లో మంటలు * ఐదు అణువిద్యుత్ కేంద్రాల మూసివేత *జల సమాధిలో సంధాయ్ పట్టణం * భారతీయులు సురక్షితం విలయం జపాన్‌ను గడగడలాడించింది. పెను భూకంప పర్యవసానంగా సంభవించిన భయానక సునామీ శక్రవారం జల ప్రళయానే్న సృష్టించింది. జపాన్‌లోని అనేక పట్టణాలు నిలువునా వణికిపోయాయి. భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. నౌకలకు నౌకలే కొట్టుకుపోయాయి. అనేక చోట్ల భూమి చీలిపోయింది. వందల సంఖ్యలో మరణాలు సంభవించినట్టు వార్తలు వెలువడుతున్నాయి. గత 140 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా సంభవించిన ఈ విషాదం జపాన్ వాసుల గుండెల్ని పిండేసింది. విలయ విధ్వంసం కరాళ నృత్యం చేసింది. భూకంపం అనంతరం సంభవించిన సునామీ కారణంగా పది మీటర్ల ఎత్తున ఉవ్వెత్తున ఎగసి పడిన అలలు పంటపొలాలు, కార్లు, బోట్లు, ఇళ్లు, పరిశ్రమలు, జనం.. ఇలా తమ దారికి అడ్డువచ్చిన అన్నిటినీ తుడిచిపెట్టేసాయి. ఇప్పటివరకు 60 మంది చనిపోయినట్లు అధికారులు చెప్తున్నప్పటికీ మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉంది. సునామీ తాకిడికి వందమంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ నౌక గల్లంతయింది. ఆస్తి నష్టం అపారంగా జరిగింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల 46 నిమిషాలకు సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 8.9 పాయింట్లు ఉన్నట్లు అమెరికా భూభౌతిక పరిశోధనా కేంద్రం తెలియజేసింది. జపాన్ తూర్పు తీరానికి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో సముద్రం అడుగున దాదాపుపది కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపం కారణంగా పసిఫిక్, ఆగ్నేయాసియా, లాటిన్ అమెరికాలోని పలు దేశాల్లో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. సునామీ హెచ్చరికలు జారీ అయిన దేశాల్లో జపాన్, రష్యా, ఇండోనేసియా, న్యూజిలాండ్, చిలీ లాంటి దేశాలున్నాయి. దక్షిణ అమెరికాలోని పలు దేశాలు, ఆస్ట్రేలియా సైతం దేశాలు కూడా ముందస్తు హెచ్చరికలు జారీ చేసాయి. అయితే మన దేశానికి సునామీ ప్రమాదం లేదని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసింది. జపాన్‌లో ఉంటున్న 25 వేల మంది భారతీయులు సురక్షితంగా ఉన్నారని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఫుకుషిమాలోని అణు విద్యుత్ కేంద్రంలోని కూలింగ్ టవర్‌లో సాంకేతిక లోపం ఏర్పడడంతో ముందుజాగ్రత్త చర్యగా ఆ కేంద్రాన్ని మూసివేసారు. మరో నాలుగు అణు విద్యుత్ కేంద్రాలను కూడా తాత్కాలికంగా మూసివేసారు. అయితే ఈ కేంద్రాలనుంచి అణు ధార్మిక ప్రమాదం లేదని అధికారులు స్పష్టం చేసారు. భూకంపం తర్వాత టోక్యో సమీపంలోని ఒక చమురు రిఫైనరీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. 30 మీటర్ల ఎత్తున మంటలు ఎగసిపడుతూ ఉండడంతో అదుపు చేయడం అసాధ్యంగా మారింది. టోక్యో నగరంలో అనేక చోట్ల మంటలు చెలరేగడంతో నగరంలోని దాదాపు నలభై లక్షల గృహాలకు కరెంటు సరఫరా లేకుండా పోయింది. ఉత్తర జపాన్‌లోని ప్రధాన రహదారి అయిన తొహోకు ఎక్స్‌ప్రెస్ హైవే అనేక చోట్ల దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. దేశంలోని ఉత్తర ప్రాంతాలకు వెళ్లే బులెట్ ట్రైన్లను సైతం నిలిపివేసారు. దేశంలోని అన్ని ప్రధాన రేవుల్లోను కార్యకలాపాలను ఆపేసారు. టోక్యోలో భూగర్భ సబర్బన్ రైళ్లను ఆపేయడంతో వేలాది మంది ప్రయాణికులు మధ్యలో చిక్కుపడిపోయారు. సెండాయ్ విమానాశ్రయాన్ని సైతం కొద్ది గంటలు మూసివేసారు. అయితే సాయంత్రం తర్వాత బయటి ప్రాంతాలకు వెళ్లే విమానాలను అనుమతించారు.
‘పరస్పరం సాయం చేసుకోండి’
దేశాన్ని పెను భూకంపం, సునామీలు కుదిపేసిన నేపథ్యంలో ఇప్పటికే తీవ్రమైన రాజకీయ వ్యతిరేకతను ఎదుర్కొంటున్న జపాన్ ప్రధాని నవోటో కాన్ ఈ ప్రకృతి విలయం కారణంగా నష్టాన్ని వీలయినంతమేరకు తగ్గించడానికి పరస్పరం సహకరించుకోవాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ భూకంపం ఉత్తర జపాన్‌లో విస్తృత ప్రాంతంలో తీవ్ర నష్టాన్ని కలుగజేసినట్లు ఆయన మీడియా సమావేశంలో చెప్పారు. కనీవినీ ఎరుగని ఈ విపత్తును ఎదుర్కోవడానికి వీలుగా ఒక ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు టీవీ ప్రసంగంలో ఆయన ప్రకటించారు. ప్రభుత్వం తన శక్తియుక్తులన్నిటినీ ఉపయోగించి ఈ విపత్తును ఎదుర్కోవడానికి కృషి చేస్తుందని ప్రధాని చెప్పారు. దేశ ప్రజలు సైతం తమ కుటుంబంలోవారికి పరస్పరం సహాయపడ్డంతో పాటు పొరుగువారికి కూడా సాయపడాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాక భూకంపం తర్వాత మరి కొద్ది రోజుల దాకా ప్రకంపనలు సంభవించే ప్రమాదం ఉంది కనుక అప్రమత్తంగా ఉండాలని కూడా ఆయన కోరారు.
భూకంపం తర్వాత ఇప్పటివరకు 2100 కిలోమీటర్ల పొడవున్న జపాన్ తీరం అంతటా అనేక సార్లు భూమి కంపించింది. కొన్ని ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 6 పాయింట్లు ఉండడంతో ఎప్పుడేమి జరుగుతుందోనని ప్రజలు ఇళ్లు వదిలిపెట్టి ఆరుబయటే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తమ ప్రాథమిక అంచనాలను బట్టి ఈ భూకంపం కారణంగా చెప్పలేనంత నష్టం సంభవించినట్లు తెలుస్తోందని ప్రభుత్వ ముఖ్య ప్రతినిధి యుకియో ఎడనో చెప్పారు. సహాయ చర్యలకోసం ఎనిమిది సైనిక విమానాలను, 500 మంది సైనికులను రంగంలోకి దింపిన ప్రభుత్వం శక్తికి మించి పని చేయాలని వారిని ఆదేశించింది. జపాన్ మంత్రివర్గం సమావేశమై పరిస్థితిని సమీక్షించడంతో పాటు మరిన్ని సునామీలు వచ్చే ప్రమాదం ఉందని అభిప్రాయ పడింది. ఈ ప్రకృతి విపత్తు సమయంలో ప్రజలను ఆదుకోవడానికి కలసిమెలసి పని చేయాలని అధికార, ప్రతిపక్షాల నాయకులు నిర్ణయించారు.

దానికి సంబందించిన వీడియోలు :



Monday, March 7, 2011

ప్రతి మనిషి చూడవలసిన వీడియో

పి.డి.ఎఫ్./ PDF



PDF అంటే Portable Document Format.

మన దగ్గరున్న ఏదైనా సమాచారం కాని డాక్యుమెంట్ కాని భద్రపరుచుకోవడానికి ,సులువుగా పంపిణీ చేయడానికి ఆ సమాచారాన్ని పి.డి.ఎఫ్ చేస్తాము.అంటే ప్రతీ పేజీని ఒక చిత్రంలా భద్రపరచడం. దాన్ని పుస్తకంలా తయారు చేయడం. ఇలా చేయడం వల్ల లాభాలు ఏంటో తెలుసుకుందాం.

* మన సమాచారాన్ని చిత్రంలా బంధించి , భద్రపరిచాము కాబట్టి అవతలి వారి కంప్యూటర్లో సులువుగా చూడగలుగుతారు. వాళ్లు ఎటువంటి సాఫ్ట్ వేర్,ఆపరేటింగ్ సిస్టం వాడినా సరే.

* మన ఫైలులో వాడిన బొమ్మలు,గుర్తులు,ఫాంట్లు ..ఎలాగున్నవి అలాగే మార్పులేకుండా చూడొచ్చు.మామూలు డాక్యుమెంట్ లా పంపిస్తే కొంచం కష్టమవుతుంది.

* ఈ పద్ధతిలో పంపిన సమాచారం ఎటువంటి ప్రింటర్ లో అయినా ప్రింట్ చేసుకోవచ్చు.

* ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్, పుస్తకాల పబ్లిషింగ్ కోసం పిడిఎఫ్ చేయడాం చాలా ఉపయోగకరమైనది.

* అంతర్జాలంలో ముఖ్యమైన సమాచారాన్ని పిడిఎఫ్ రూపంలో పెడితే దానిని కాపీ చేసుకోవడం కుదరదు.అదే మామూలుగా డాక్యుమెంట్ లా ఉంటే సులువుగా కాపీపేస్ట్ చేసుకోవచ్చు. కష్ట పడి తయారు చేసిన సమాచారాన్ని భద్రపరుచుకోవడానికి ఇది సులువైన మార్గం.

* ఇక తెలుగు విషయానికొస్తే... పుస్తకాలు,పత్రికలవాళ్ళు ఉపయోగించేది అను,శ్రీలిపి ఫాంట్లు.అవి యూనికోడ్ లో సరిగ్గా కనిపించవు.మళ్ళీ యునికోడ్ లో రాయాలంటే కష్టం.లేదా అవతలి వారి సిస్టంలో కూడా ఆ సాఫ్ట్ వేర్ ఉండాలి.అదే వ్యాసాలూ పిడిఎఫ్ చేసి పంపిస్తే ఎలాటి ఇబ్బంది లేకుండా చూడగలం. అందుకే పత్రిక రంగంలోని వారికి ఈ పధ్ధతి చాలా ఉపయోగకరమైనది.

* ఎక్స్.పి తర్వాత అన్ని ఆపరేటింగ్ సిస్టంలలో వాడే ఫాంట్ గౌతమి. కాని అంతకు ముందు వాడే ఆపరేటింగ్ సిస్టంలలో ఇది కనిపించదు. మరి ఎలా. మన వ్యాసం కాని ఉత్తరం కాని సమాచారం కాని వాళ్లు చదవాలంటే ఎలా. పిడిఎఫ్ చేసి పంపిస్తే చాలు. ఇందులో రాత మొత్తం బొమ్మలా మార్చబడుతుంది కాబట్టి ఇంచక్కా తెలుగులోనే కనిపిస్తుంది.

* మీరు బ్లాగులో ఒక విషయంపై పది టపాలు రాసారనుకోండి. వాటిని ఒక దగ్గర ప్రోగు చేసి ఒక డాక్యుమెంట్ లా లేదా పుస్తకం లా చేసి పెడితే బావుంటుంది కదా.ఎవరికైనా పంపించవచ్చు. డాక్యుమెంట్ పెద్దగా ఉంటుంది .చదవడం కష్టంగా ఉంటుంది.అదే పిడిఎఫ్ చేసి పంపితే పుస్తకంలా చదువుకుంటారు.

ఈ పిడిఎఫ్ ఎలా చేయాలి. ఎలా చదవాలి అనే విషయాలు ఇపుడు చూద్దాం.

మనకు ఒక పిడిఎఫ్ ఫైల్ వచ్చింది.లేదా చదవాలి . దానికోసం రీడర్ కావాలి. ఇది డౌన్లోడ్ చేసి మీ సిస్టం లో భద్రపరుచుకోండి.


Adobe Reader


Foxit Reader


పిడిఎఫ్ చేయడానికి ఎన్నో పద్ధతులు ఉన్నాయి.
1. Microsoft Word లో చిన్న యాడ్ ఆన్ చేరిస్తే మన డాక్యుమెంట్ తయారుకాగానే పిడిఎఫ్ లా వెంటనే చేసుకోవచ్చు.

2. Openoffice లో కూడా మన డాక్యుమెంట్ కాగానే పిడిఎఫ్ లా మార్చుకుని సేవ్ చేసుకోవచ్చు.

౩. Cute PDF writer

3. PDF converter

4. PDF995

5. Dopdf