Wednesday, July 17, 2013


Wednesday, July 3, 2013

ఉత్తరాఖండ్ వరదలు : మృతులు 11 వేలు : ఐక్యరాజ్య సమితి


ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సంభవించిన వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 11 వేల వరకు ఉండొచ్చని ఐక్యరాజ్య సమితి ఒక అంచనా వేసింది. ఈ అంచనాను పలు స్వంచ్ఛంద సంస్థల సహకారంతో వేసినట్టు ఐక్యరాజ్య సమితి తెలిపింది.

అయితే, ఈ వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3500 నుంచి 3700 వరకు ఉంటుందని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (యూఎన్ఎన్ డీఆర్ఎఫ్) ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. అయితే స్థానికంగా దాఖలైన ఎఫ్ఐఆర్‌ల ప్రకారం ఆచూకీ గల్లంతైన వారి సంఖ్య ఈ విధంగా ఉంటుందని ఆయన తెలిపారు.

ఇంకోవైపు ఈ వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఖచ్చితంగా చెప్పలేమంటూ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ తెలిపారు. మృతుల సంఖ్యపై ఒక అంచనాకు రావాలంటే కొంత సమయం పడుతుందని ఆయన చెప్పుకొచ్చారు.

అయితే, ఉత్తరాఖండ్ వరద సహాయ చర్యల్లో నిమగ్నమైవున్న వివిధ స్వచ్చంధ సంస్థల నుంచి సేకరించిన సమాచారం మేరకు ఈ వరదల్లో మొత్తం 2000 వేల నుంచి నాలుగు వేల గ్రామాలు ముంపునకు గురైనట్టు సమాచారం.