Tuesday, April 19, 2011

గుడ్డు సంపూర్ణ పౌష్టికాహారం
2020 నాటికి ప్రపంచ దేశాలలో ‘‘భారత్‌ నెంబర్‌ ` 1 దేశం’’ కాబోతుందని మేధావులు చెపుతున్నారు. కాని అంతకంటే వేగవంతంగా ‘‘క్షీణింపచేసే దీర్ఘకాలిక వ్యాధులకు’’ భారత్‌ ముందున్నదని ‘‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’’ తెలియజేస్తున్నది. ఆధునిక వైద్యరంగంలో బ్యాక్టీరియా రోగాలకు యాంటిబయోటిక్స్‌, వైరల్‌ రోగాలకు వ్యాక్సిన్స్‌, కుక్క కాటుకు, పాము కాటుకు వ్యాక్సిన్‌ లాంటి నిరోధకాలు వస్తున్నప్పటికీ, రోగాల నుండి నివారణ కేవలం 30శాతం మాత్రమే. దేశంలో 70 శాతం వ్యాధులు పోషకాహార లోపం, 45 శాతం ప్రోటీన్‌లోపం, 40 శాతం రక్త లేమి వలస ప్రజలు ఇబ్బందికి గురి అవుతూ ప్రజలు ఎప్పటికప్పుడు అనేక రకాలైన ఆహార పదార్థాల గూర్చి తెలుసుకుంటున్నా అంతకంటే వేగవంతంగా కృత్రిమ కంపెనీల మోసపూరిత ప్రకటనలతో అవసరంలేని వ్యర్ధపదార్ధముల ద్వారా ఆరోగ్యానికి హాని కల్గించుకుంటున్నారు. భారత్‌ పేదదేశం కాదు, కాని పేదరికపు ఆలోచనా విధానంతో, అవగాహన లోపంతో, కుల, మత, సాంఘిక, చాదస్తాలతో అలవాటుగా మారి అనేక వ్యాదులనుండి విముక్తి కాలేకపోతున్నారు. కావున గుడ్డు ఆరోగ్యానికి వెరిగుడ్‌ అని దాన్ని స్వీకరించి ఆరోగ్యాన్ని పెంపొందించుకొని శక్తివంతంగా తీర్చిదిద్దుకుందాం.
గుప్పెడంత గుడ్డులో గంపెడంత ఆరోగ్యం
1. మంచి ఆహారం : భారత్‌ పౌష్టికాహార సంస్థ గుర్తించిన 650 ఆహార పదార్ధాలలో గుడ్డు నెంబర్‌ ` 1
2. ధాతువులు : శరీరానికి ూపయోగపడే ధాతువులు 45 అయితే గ్రుడ్డులో 44 ధాతువులు ూన్నాయి.
3. ప్రోటీన్లు : శ్రేష్ఠమైన ప్రోటీన్లు. గుడ్డులోని తెల్ల సొనలో 6.5 గ్రాముల ప్రోటీన్‌ ూన్నది. (మార్కెట్లో ఒక గ్రాము ప్రోటీన్‌ రూ.3 అమ్ముతున్నారు.
4. అసంతృప్త క్రొవ్వులు : శరీరానికి ూపయోగపడే అసంతృప్త క్రొవ్వులు పచ్చ సొనలో అధికం.
5. కొలెస్ట్రాల్‌ : గుడ్డులోని పచ్చసొనలో ూండి అన్ని రకములైన జీవక్రియకు ూపయోగపడుతుంది. (గుండె జబ్బులు వస్తాయని అనుకోవటం అపోహ మాత్రమే.)
6. క్యాలరీస్‌ : అతితక్కువ, 77 కెలరీస్‌ మాత్రమే ూండును. వేడి, ూడుకు, గర్మి అనేది చేయదు.
7. ఖనిజాల గని : గుడ్డులో మరీ ముఖ్యంగా పచ్చసొనలో 12 ఖనిజాలు మరియు 8 లవణాలు అధికం.
8. జీవ పోషకాల నిధి : క్రొవ్వులో కరిగే ‘ఎ’, ‘డి’, ‘ఇ’, ‘కె’ అనే ఈ విటమిన్లు మరియు నీటిలో కరిగే బికాంప్లెక్స్‌ విటమిన్లు
నిండు నూరేళ్ళు జీవించే వారు ఎవరు? 2007 ప్రపంచ సర్వే రిపోర్టు :
ఎ) 1. మంచి ఆహారం, 2. క్రమం తప్పని వ్యాయామం, 3 మంచి మానవ సంబంధాలు, 4 మంచి దాంపత్య జీవితం, 5. ఆధ్యాత్మిక చింతన. మంచి ఆహారంలో ‘‘ప్రకృతి ప్రసాదించిన ఫాస్ట్‌ పుడ్‌ గుడ్డే ముద్దు’’ అని నిర్ధారించింది.
బి) మహిళలకు, గర్భిణీలకు కావలసిన ఐరన్‌, ఫోలీక్‌ ఆమ్లాలు గుడ్డులోని పచ్చసొనలో అధికం.
సి) యువతీ, యువకుల ‘‘నిత్య యవ్వన సౌవర్ధినియగు విటమిన్‌ ‘ఇ’, విటమిన్‌ ‘డి’, సెలీనియం కూడా ఎక్కువ. చిన్న పిల్లల దేహ దారుఢ్యానికి ఎముకల పుష్టిని పెంపొందించే క్యాల్షియం, మిటిమిన్‌ ‘డి’ మెగ్నీషియం పుష్కలం.
డి) పిల్లల కండ పుష్టి వ్యాధినిరోధక శక్తి, జ్ఞాపకశక్తిని పెంపొందించే ధాతువులు, సమపాళ్ళల్లో ూన్నాయి.
ఇ) యువకుల కండర పుష్టిని ఇంద్రియ పుష్టిని పెంపొందించే అన్ని రకాల బికాంప్లెక్స్‌ విటమిన్లు ఎక్కువే, వయస్సు పైబడ్డవారు ఆలసిపోకుండా కూరగాయలలో, పండ్లలోలేని విటమిన్‌ బి12, విటమిన్‌ ‘డి’ ఫోలిక్‌ యాసిడ్‌ అధికం.
ఆధునిక జీవన శైలి వ్యాధులకు ` గడ్డులోని యాంటి ఆక్సిడెంట్స్‌ పరిష్కారం :
1. ప్రాణవాయువు జీవించడానికి కావాలి.
2. అదే ప్రాణవాయువు నీరు, గాలి ఆహార పదార్ధాల కాలుష్యం వలన ‘‘ క్షీణింపచేసే దీర్ఘకాలిక వ్యాధులకు’’ మూలం అవుతుంది. దీన్నే ‘‘ఆక్సిడేషన్‌’’ అంటున్నారు.
3. గుడ్డులోని పచ్చసొనలో ప్రత్యేకంగా కాపర్‌, జింక్‌, మాంగనీస్‌, సెలీనియం అనేక ఖనిజాలు, ఫోలిక్‌ యాసిడ్‌, బి1, బి2, బి6, బి12 విటమిన్‌ ‘ఎ’ మరియు విటమిన్‌ ‘ఇ’ యాంటి ఆక్సిడెంట్‌గా పనిచేస్తాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన వ్యాధులు ` గుడ్డు ద్వారా నివారిణ :
1. ఒత్తిడి : ఒత్తిడిని తగ్గించే శక్తి గుడ్డులోని తెల్లసొనలో హిస్టోడిన్‌, పచ్చసొనలో జింక్‌, కోలిన్‌, అయోడిన్‌ మరియు లినోలిక్‌ యాసిడ్‌, ూండుటవలన మేధస్సు కణాలు ఎప్పటికప్పుడు నిర్మించబడుతూ ఒత్తిడి నుండి కాపాడుటయే గాక జ్ఞాపకశక్తిని, వ్యాధినిరోధక శక్తిని పెంపొందించును.
2. ఊబకాయం : గుడ్డులోని పచ్చసొనలో శరీర సౌష్టవాన్ని కాపాడే విటమిన్‌ ‘డి’ అనవసరమైన క్రొవ్వును కరిగించే కోలిన్‌ అనే ధాతువు, సెలీనియం మరియు బి12 పుష్కలంగా ూండుట వలన వారానికి మూడు సార్లు రెండు గుడ్ల చొప్పున ూదయం బ్రేక్‌ పాస్ట్‌గా తీసుకున్నచో ఊబకాయము తగ్గించవచ్చునని అనేక పరిశోధనలు తెలియజేస్తున్నాయి.
3. మధుమేహం : నేటి జీవన శైలిలో భయంకరమైన చిత్ర విచిత్ర వ్యాధి. ఇటువంటి వ్యాధి నుండి కాపాడుటకు గుడ్డులోని తెల్లసొన ద్వారా లభించే ప్రోటీన్‌ ప్యాంక్రియస్‌ గ్రంధిని నిర్మించి, జింక్‌, క్రోమియం ద్వారా ఇన్స్‌లిన్‌కు జీవక్రియ కలుగజేసి, ఇన్స్‌లిన్‌ అడ్డంకిని తొలగించటానికి ూపయోగపడే విటమిన్‌ ‘ఇ’ దానిని మెరుగు పరచటానికి కావల్సిన మెగ్నీషియం, బయోటిన్‌, నియోసిస్‌ అనే విటమిన్లు గుడ్డులోని పచ్చసొనలో అపారం.
4. దృష్టిదోషం : శరీరానికి కన్నే వెలుగు. ఆ కంటిని రక్షించాలంటే విటమిన్‌ ‘ఎ’ ప్రధానమైన జీవపోషకం. గుడ్డులోని పచ్చసొనలోనే అధికం. కంటి దోషాలు లేకుండా ూండాలంటే జింక్‌, సెలీనియం, విటమిన్‌ ‘ఇ’ దీనిలో హెచ్చుగా నున్నవి. కావున కంటి జీవకణాన్ని రక్షించి పోషిస్తూ ూంటాయి.
5. బోలు ఎముకల వ్యాధి : శరీరంలోని అస్థిపంజరం నిర్మాణానికి ముఖ్యమైన పోషకాలు గుడ్డులోని పచ్చసొనలో అధికం. అవి ఏమనగా కాల్షియం ముఖ్యం. దీనిని గ్రహించడానికి విటమిన్‌ ‘డి’ మరియు ఎముకల్లో జరిగే జీవ రసాయనిక ప్రక్రియలన్నిటిలో మెగ్నీషియం చాలా అవసర.ం ఇంకా మాంగనీసు, పైగా కాల్షియం మూత్రం ద్వారా బయటికి పోకుండా విటమిన్‌ ‘కె’ మరియు పోలిక్‌ యాసిడ్‌, బి6, బి12 గుడ్డులో అధికంగా ూండుటవలన రోజూ గుడ్డు తీసుకోవటం వలన ఈ వ్యాధి రాకుండా నిరోధించవచ్చు.
6. క్యాన్సర్‌ నివారణి : మందులు లేవు, కాని గుడ్డులోని పచ్చసొనలో అనేక విధములైన యాంటి ఆక్సిడెంట్స్‌ విటమిన్‌ ‘ఎ’ కెరోటిన్‌ ద్వారా లూమీ ప్లేమిన్‌, లూమీ క్రోమిన్‌ అనే యాంటి ఆక్సిడెంట్స్‌ ద్వారా బ్రస్ట్‌ క్యాన్సర్‌ మరియు లూటిన్‌, జియాక్సింథిన్‌ ద్వారా చర్మ క్యాన్సర్‌ రాకుండా నిరోధించవచ్చును. పైగా విటమిన్‌ ‘ఇ’ ద్వారా క్యాన్సర్‌ రాకుండా నిరోధించవచ్చును. పైగా విటమిన్‌ ‘ఇ’ ద్వారా క్యాన్సర్‌ కణాలను క్షీణింపచేయవచ్చును. ఇవి గుడ్డులోని పచ్చసొనలో అధికం.
7. అల్జీమర్‌ మరియు పార్కిన్‌సన్‌ వ్యాధులు (మతిపరపు, వణుకుడు) : చిన్ననాటి నుండి మంచి శ్రేష్ఠమైన ప్రోటీను కలిగిన ఆహారం, అదనపు జీవపోషకములు తీసుకున్నచో ఈ వ్యాధులను నివారించవచ్చును. ఇవి గుడ్డుద్వారా పొందవచ్చును.
8. గుండె జబ్బులు 100 శాతం ప్రజలు భయపడే వ్యాధి ఇది ప్రజలు కొనతెచ్చుకొనే వ్యాధి :
ఎ) గుండె కండరం నిరభ్యంతరంగా పనిచేయుటకు ప్రోటీన్‌ కావలెను. అది గుడ్డులోని తెల్లసొనలో అపారంగా ూంది.
బి) గుండె కండరాలు పనిచేయుటకు గుడ్డులోని పచ్చసొనలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం తదితర 12 ఖనిజాలు, వివిధములైన 12 రకాలైన విటమిన్లు ఎక్కువగా కలవు.
గమనిక : గుండె చక్కగా పనిచేయుటకు మంచి కొలస్ట్రాల్‌ మరియు అసంతృప్త క్రొవ్వులు అవసరం. గుడ్డులోని పచ్చసొనలో కొలెస్ట్రాలు, కొలస్ట్రాలు ద్వారా రక్తనాళాలు గడ్డకట్టకుండా లీనోలిక్‌ యాసిడ్‌, అసంతృప్త క్రొవ్వుల ద్వారా మంచి కొలస్ట్రాలు ఎక్కువ చేయబడి గుండె జబ్బులు రాకుండా ూండుటకు గుడ్డులోని క్రొవ్వులు ూపయోగపడును. కావున అనవసరమైన నూనె పదార్ధాలు, జంక్‌ ఫుడ్స్‌ తినటం తగ్గించుకొని (కొలస్ట్రాల్‌ తగ్గించుకొని) ఇటువంటి మంచి ఆహార పదార్ధం వదిలివేయకుండా తిని గుండె జబ్బుల నుండి రక్షించుకొనవచ్చును.
గుడ్డు శాకాహారమా ` మాంసాహారమా ? ఆవు, గేదె రక్తమాంసం నుండి వచ్చే పాలు జీవశాస్త్రం ప్రకారం మాంసాహారమే కాని ప్రజలు శాకాహారముగా భావిస్తున్నారు. అలాగే కోళ్ళ ఫారాలలో పుంజులుండవు పెట్టలైన కోళ్ళు సమగ్ర ఆహారం తిని పుంజు కలయిక లేని అనగా జీవంలేని గుడ్లను ఇస్తాయి. (ఈ గుడ్లు పొదిగించినచో పిల్లలు రావు) కావున పాలవలె, తేనె వలే దీనిని కూడా శాకాహారంగా భావించవచ్చునని మహాత్మాగాంధీ గారు చెప్పారు. (కీటూ హెల్త్‌ అనే బుక్‌నుండి సేకరణ).
అపోహలు నిజాలు : మన దేశంలో వంటకాలన్నీ ` చికెన్‌ 90 ` 100 డిగ్రీ సెంటీగ్రేడు వద్ద, గుడ్లు 65 ` 75 డిగ్రీ సెంటీ గ్రేడు వద్ద ూడికిస్తారు. ఈ వేడికి బర్డ్‌ఫ్లూ వ్యాధి క్రిములు బట్టకట్టి రోగాలు కలుగజేస్తాయన్నది 100% అబద్దం. కనుక కోళ్లను గుడ్లను నిర్భయంగా తినవచ్చును.
గుడ్లు వేడి చేయవు. మలబద్ధకం చేయదు. కడుపులో గ్యాస్‌ ూత్పత్తి చేయదు. ూడికించిన గుడ్డు శ్రేష్ఠము. రోజు పచ్చిగుడ్డు తీసుకున్నచో జీర్ణం కాదు. ఆమ్లెట్‌ మంచిదే అయిల్‌ వద్దు అనుకునేవారు ఎక్కువగా ూడికించిన గుడ్డును తీసుకొనవచ్చును. పొట్లకాయ మరియు గుడ్డు కలిపి వండినచో విషం కాదు. గర్భిణీ స్త్రీలు ూడికించిన గుడ్డును తింటే గర్భస్థపిండం పుట్టెంట్రికలు ఎక్కువ వస్తాయి.
గుడ్డులోని పచ్చసొన బంగారం లాంటిది. గుడ్డు తీసుకున్నప్పుడు దీనిని ఎటువంటి పరిస్థితిలో విడువరాదు. పచ్చసొనలోని క్రొవ్వులో కోలీన్‌ అనే ధాతువు ూండుటవలన దీనిని తీసుకోవటం వలన శరీరంలో ూన్న వ్యర్ధమయిన క్రొవ్వును తొలగించును. పచ్చసొనలో ూన్న క్రొవ్వులో విటమిన్‌ ‘ఎ’, ‘డి’, ‘ఇ’, ‘కె’ క్రొవ్వులోనే కరిగేవి ూన్నవి. పచ్చసొనలో వున్న అసంతృప్త క్రొవ్వుల ద్వారా గుండెకు ఆరోగ్యమే మరియు మంచి కొలెస్ట్రాల్‌ ూన్నది.
గమనిక : గుండెజబ్బులు రాకుండా వారానికి ఐదు, ఆరు గుడ్లు తినవచ్చును. ఒక వేళ గుండె జబ్బులు ూన్నచో వారానికి మూడు గుడ్లు పచ్చసొనతో తినవచ్చును. అధిక కొలెస్ట్రాల్‌ గాని ట్రైక్లిజరైడ్స్‌ ఎక్కువగా ూన్నవారు మాత్రమే గుడ్డులోని పచ్చసొన తినవద్దు.
కావున కలియుగంలో కల్తీ చేయకుండా గట్టి కవచం ధరించిన ఈ గుడ్డు పాలకంటే, టీ, కాఫీ కంటే, పాన్‌ కంటే, ఆరోగ్యం పాడుచేసే గుట్కా, సిగరెట్‌, బీడీకంటే మిరపకాయ బజ్జీలకంటే తక్కువధరకే లభిస్తున్నది.
ఇటువంటి మంచి ఫుడ్డు దేవుడొసగితే పండుగలు, పబ్బాలు, వారాలు ` ూపవాసాలు అంటూ వదలి వేయుచూ (అదే సమయంలో కల్తీ పాలు, బోరింగ్‌ బావి ఫ్లోరైడ్‌ నీళ్ళు) పుణ్యం అంటూ తాగుతూ రోగాలు తెచ్చుకుంటూ అనేక ఆసుపత్రుల నిర్మాణానికి తోడ్పడుచూ శాపగ్రస్తులు అగుచున్నారు. మీ ఇంటికి వచ్చే అతిథులకు బలవంతంగా ఇచ్చే టీ ద్వారా గ్యాస్‌ రోగులుగా తయారు చేయకండి. రెండు గుడ్లు ఇచ్చి ఆరోగ్యాన్ని పెంచండి. స్వామి వివేకానందుల వారు ‘‘దుర్భలులు కాకుండా మంచి పౌష్టికాహారం తినండి బలమైన భారతీయులుగా రూపొందండి’’ అని ూద్భోధించారు. కావున ఈ రోజు గుడ్డు తీసుకొని మంచి ఆరోగ్యవంతులై ఆరోగ్య భారతిని నిర్మాణం చేద్దాం.
గుడ్డు ద్వారా బ్రేక్‌ ఫాస్ట్‌ :
1. ూడికించిన రెండు గుడ్లు వాటిపై మిరియాల పౌడర్‌ చల్లుకొని, మొలకెత్తిన పెసలు, క్యారెట్‌ ముక్కలు, కీర దోసముక్కలు ఒకరోజు
2. రెండు గుడ్లతో ఆమ్లెటు నాలుగు బ్రెడ్‌ ముక్కలు ` ఒక రోజు
3. రెండు గుడ్లతో 50 మి.లీ. పాలు 10 గ్రాములు షుగర్‌ కలిపి గిలకొట్టి నాలుగు బ్రెడ్‌ ముక్కలు ముంచి వాటిని పెనంపై వేడిచేసి తినవచ్చును ` ఒకరోజు
4. ఈ రకంగా సంవత్సరానికి 320 గుడ్లు వాడుకోవచ్చును. తినదల్చుకున్నచో రోజూ గుడ్డు తీసుకున్నా ఎటువంటి హాని చేయదు.
గుడ్డు ద్వారా సౌందర్య చిట్కా :
1. గుడ్డులోని తెల్లసొనలో రెండు చంచాలు తేనె, నిమ్మరసం కలిపి గిలకొట్టి ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత చన్నీళ్ళలో కడిగేసుకోవాలి.
2. గుడ్డులోని తెల్లసొన ఒక చంచా, ఒక చంచా బేబి ఆయిల్‌, ఆలీవ్‌ నూనె కలిపి గిలకొట్టి శిరోజాలకు షాంపూగా వాడుకోవచ్చు.
ఎన్‌.ఇ.సి.సి. నివేదిక